డెమొక్రాట్ల తొలి విజయోత్సవ సభలో జో బైడెన్

Update: 2020-11-08 05:09 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘనవిజయం సాధించారు. ట్రంప్‌, బైడెన్‌ల మధ్య హోరాహోరీ పోరులో 290 ఎలక్టోరల్‌ ఓట్లు సొంతం చేసుకున్న బైడెన్ 300 ఓట్ల దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం 214 ఎలక్టోరల్‌ ఓట్ల దగ్గరే ఆగిపోయారు. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ అవతరించారు. అలాగే అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించారు. దీంతో భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఘనవిజయం సాధించిన తర్వాత డెమొక్రాట్లు తొలి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో జో బైడెన్‌ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని అన్నారు జో బైడెన్. 7.4 కోట్ల మంది అమెరికన్లు డెమొక్రాట్లకు ఓటు వేశారని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్నారు బైడెన్. అమెరికా చరిత్రలో ఇదో రికార్డు అన్న జో.. అమెరికన్లు ఆశిస్తున్న పాలన ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ట్రంప్‌ తనకు శత్రువు కాదన్న బైడెన్ సరికొత్త అమెరికా నిర్మాణంలో ట్రంప్‌ కలిసిరావాలన్నారు. అమెరికాలో వర్ణవివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందామన్న బైడెన్ కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News