ఇటలీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందా?

గత 24 గంటల్లో ఇటలీలో 415 మరణాలు, 2,357 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-26 11:05 GMT

గత 24 గంటల్లో ఇటలీలో 415 మరణాలు, 2,357 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం అంటువ్యాధులు సంఖ్య 195,351 కు చేరుకుంది. మరణాల సంఖ్య 26,384 గా ఉంది. ఇందులో రికవరీ అయిన వారి సంఖ్య 63,120 గా ఉంది. ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఐరోపా ఖండంలో ఇక్కడే అత్యధిక మరణాలు, కేసులు ఎక్కువ.

ఇటలీలోని లోమ్బార్ది ప్రాంతంలో అత్యధికంగా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం ఇక్కడ కొత్తగా 700 పాజిటివ్ కేసులు రావడంతో 72,000 ను దాటింది. ప్రస్తుత లాక్డౌన్ త్వరలో ముగిస్తున్న తరుణంలో ప్రజలు సామాజిక దూరాలను పాటించాలని.. మే 4 నుండి ఆంక్షలలో సడలింపు ఉంటుందని అధికారులు ఇటాలియన్లకు సూచించారు. అయితే ఇటలీలో గతంతో పోల్చితే వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టే అర్ధమవుతోంది. రెండు వారాల కిందట ఇక్కడ ఒక్కోరోజు 700 లకు పైగా మరణాలు, వేలాది కేసులు నమోదయ్యేవి. ఈ తరుణంలో తాజాగా తక్కువ కేసులు నమోదు కావడం ఇటాలియన్లకు ఊరట కలిగించే విషయమే.


Tags:    

Similar News