Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదం.. సైట్ లొకేషన్ చూపిన డ్రోన్ వీడియో

Ebrahim Raisi: క్రాష్‌ సైట్‌కు చేరుకున్న రెడ్ క్రెసెంట్ టీమ్‌

Update: 2024-05-20 03:38 GMT

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదం.. సైట్ లొకేషన్ చూపిన డ్రోన్ వీడియో 

Ebrahim Raisi: ఇరాన్‌ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ క్రాష్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతంలో అదృశ్యమైన అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ స్థానాన్ని మానవరహిత వైమానిక వాహనం గుర్తించినట్లు తెలిసింది. హెలికాప్టర్ ఆచూకీ కొనుగొనేందుకు సైన్యం రంగంలోకి దిగింది. సైన్యంతో పాటు రివల్యూషనరీ గార్డ్ దళాలు, పోలీసు విభాగాలతో సహా 60 కంటే ఎక్కువ రెస్క్యూ టీమ్‌లు పొగమంచు, పర్వత ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. అయితే రెడ్ క్రెసెంట్ అండ్ రెస్క్యూ బృందాలు అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ సైట్‌కు చేరుకున్నాయని ఇరాన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. రైసీ హెలికాప్టర్‌ను రెస్క్యూ టీమ్‌లు కొనుగొన్నాయని ఇరాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే అధ్యక్షుడు , సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్​బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్​ను ఆయన అజర్​బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్​తో కలిసి ప్రారంభించాలన్నది ప్రణాళిక. అయితే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కాగా, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్, ఈస్ట్​ అజర్​బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ ఇతర అధికారులు రైసీతో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News