Indonesian Sriwijaya Air plane missing after take-off
ఇండోనేషియాలో విమానం గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. జకర్తా నుంచి పొంటియానక్ బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన నిమిషాల వ్యవధిలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది.
ఇండోనేషియాలో కేటగిరీ వన్ ఎయిర్‌లైన్స్‌గా పేరుపడిన శ్రీ విజయకు చెందిన అదృశ్యం అవడంపై ప్రయాణికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన విమానంలో 59 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రాడార్‌తో సంబంధం కోల్పోయిన వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానం జాడ కోసం అన్వేషిస్తున్నారు. ఓ నిర్జన ద్వీపంలో ఈ విమానం కూలిపోయి ఉంటుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, రాడార్ సమాచారాన్ని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.