చైనా మీడియాకు భారత్ షాక్
India Bans China Media: భారత సాయుధ బలగాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయన్న కారణంతో భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
చైనా మీడియాకు భారత్ షాక్
India Bans China Media: భారత సాయుధ బలగాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయన్న కారణంతో భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ప్రభుత్వ అధికార మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్ (Global Times) మరియు జిన్హువా (Xinhua)కు చెందిన ఎక్స్ (ex-Twitter) ఖాతాలను నిషేధించింది. ఈ సందర్భంగా, చైనాలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల వాటిని తప్పుడు వార్తల ప్రచారం చేయొద్దని హెచ్చరించినా, అవి తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని కొనసాగించడంతో ఈ చర్య తీసుకుంది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ అనుకూల ఖాతాల తప్పుడు ఆరోపణలు
పాకిస్థాన్ అనుకూల ఖాతాలు మరియు కొన్ని అంతర్జాతీయ మీడియా వేదికలు భారత రాఫెల్ యుద్ధ విమానం కూల్చివేశారన్న తప్పుడు వార్తను వైరల్ చేయగా, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం దానిని తప్పుడు సమాచారం అని ఖండించింది. పాకిస్తాన్ ప్రచారం చేసిన ఫోటో 2021లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో కూలిన మిగ్-21 కు సంబంధించినదని అధికారికంగా స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల పేర్ల మార్పుపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన
ఇక, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా నకిలీ పేర్లు పెట్టడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. "అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి విడదీయరాని భాగం" అని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ — "చైనా ఎన్నిసార్లు పేర్లు పెట్టినా వాస్తవం మారదు" అని పేర్కొన్నారు.