Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ హత్యకు కుట్ర..?

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరోమారు హత్యకు కుట్ర జరిగిందా?

Update: 2023-01-28 07:15 GMT

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ హత్యకు కుట్ర..?

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరోమారు హత్యకు కుట్ర జరిగిందా? ఇమ్రాన్‌ను ఖతం చేసేందుకు స్కెచ్ వేసిందెవరు? ఇమ్రాన్‌ఖాన్ తాజాగా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తన హత్యకు మళ్లీ పథక రచన జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈసారి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని ఇమ్రాన్ విమర్శించడం హాట్‌ టాపిక్‌గా మారింది. తనను హత్య చేసేందుకు జర్దారీ ఓ ఉగ్రవాద సంస్థకు భారీగా సుపారీ ముట్టజెప్పారని ఇమ్రాన్ తెలిపారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన డబ్బును జర్దారీ తన హత్యకు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తన హత్యకు కుట్ర చేసినవారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News