Houston University: హిందూ మతంపై ప్రముఖ యూనివిర్శిటీలో విష ప్రచారం.. అసలేం జరిగింది?
Houston University: అమెరికాలో హిందూఫోబియా కొత్త విషయం కాదు. ఇది కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్య.
Houston University: హిందూ మతంపై ప్రముఖ యూనివిర్శిటీలో విష ప్రచారం.. అసలేం జరిగింది?
Houston University: యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లో అందిస్తున్న 'లివ్డ్ హిందూ రిలిజన్' అనే కోర్సు ఇప్పుడు అమెరికాలో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ కోర్సులో హిందూ మతాన్ని తప్పుగా ప్రదర్శించారని, హిందూఫోబియా వ్యాప్తి చేస్తున్నారని ఓ భారతీయ-అమెరికన్ విద్యార్థి వాసంత్ భట్ ఆరోపించాడు. ఈ కోర్సు వీడియోలలో భారత ప్రధాని నరేంద్ర మోదీని 'హిందూ ఫండమెంటలిస్ట్'గా సూచించడం ప్రత్యేకంగా విమర్శలకు గురైంది. ఈ తరగతులు ప్రొఫెసర్ ఆరోన్ మైఖేల్ ఉల్రీ ద్వారా వారానికి ఒకసారి ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు.
విద్యార్థి వాసంత్ భట్ విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేసినా, తగిన స్పందన రాలేదని చెప్పారు. రీలిజియన్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ విద్యార్థి ఆందోళనలపై దృష్టి పెట్టక, అతని ఫిర్యాదును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని ఆయన అభిప్రాయం. ఈ కోర్సు పాఠ్యపుస్తకాల్లో, హిందూమతం అనేది ఆధునిక సమాజంలో రాజకీయంగా తయారైన వ్యవస్థగా, హిందూత్వ భావన దౌర్జన్యానికి మార్గం వేసే పద్ధతిగా పేర్కొనడం తీవ్రంగా విమర్శించబడుతోంది.
ఈ అంశంపై 'హిందూ ఆన్ క్యాంపస్' అనే విద్యార్థుల ఆధ్వర్యంలోని సంస్థ కూడా భట్ అనుభవాన్ని పంచుకుని తమ మద్దతు ప్రకటించింది. హిందూమతంతో సంబంధం ఉన్న వ్యక్తులపై రాజకీయ ఆరోపణలు చేయడం కాదు, అసలు మతంపై తప్పుడు సమాచారం పంచడం దురుద్దేశ్యంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు.
అమెరికాలో హిందూఫోబియా కొత్త విషయం కాదని, ఇది కొన్ని దశాబ్దాలుగా ఉండే సమస్య అని పలువురు భారతీయ-అమెరికన్లు గుర్తుచేశారు. 1990ల నుంచే ఇది అర్థమయ్యేదని, కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదని రచయిత రాజీవ్ మల్‌హోత్ర గుర్తుచేశారు. ఇది కేవలం ఓ తరగతి కోర్సులోని విషయమాత్రమే కాదు, అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీల్లో హిందూమతంపై ఉన్న గాఢమైన అపోహల పరంపరను ఇది ప్రదర్శిస్తోందని భట్ అభిప్రాయపడ్డారు.
యూనివర్సిటీ అధికార ప్రతినిధి షాన్ లిండ్సే స్పందిస్తూ, అధ్యాపక స్వేచ్ఛను గౌరవిస్తూ ఉండే తమ విధానం ప్రకారం, కోర్సులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, అయితే అందిన ఫిర్యాదులపై సమీక్ష జరుగుతోందని తెలిపారు. ఇది ఒకవైపు హిందూ విద్యార్థులపై అపోహలు పెంచేలా మారుతుందని.. హింస, వివక్షకు వేదికగా మారవచ్చని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.