Hongkong Fire Accident: హాంకాంగ్ అగ్నిప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
Hongkong Fire Accident: హాంకాంగ్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
Hongkong Fire Accident: హాంకాంగ్ అగ్నిప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
Hongkong Fire Accident: హాంకాంగ్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 83 మంది మరణించినట్టు అధికారులు గుర్తించారు. మరో 76మంది గాయపడగా వారిలో 28మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 270మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను రిపేర్ చేస్తున్న వర్కర్ల నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు.
ఓ వర్కర్ స్మోక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థాయ్ పో జిల్లాలోని భారీ భవన సముదాయంలో మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు బ్లాకుల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. 304 ఫైర్ ఇంజిన్లు, రెస్క్యూ వాహనాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. భవనంలోని వెదురు బొంగులు, గ్రీన్ మెష్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ కాంప్లెక్స్ లో మొత్తం 4వేల 600మంది నివసిస్తున్నట్టు సమాచారం.