USA: మంచు తుపాను బీభత్సం.. స్కూళ్లు, కరెంట్ బంద్, విమానాలు రద్దు

USA: న్యూయార్క్‌లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం

Update: 2024-02-15 08:46 GMT

USA: మంచు తుపాను బీభత్సం.. స్కూళ్లు, కరెంట్ బంద్, విమానాలు రద్దు

USA: అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని తీవ్ర మంచు తుపాను తాకింది. దీంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. కొన్ని పట్టణాల్లో దాదాపు అడుగు మందం మంచు కురిసింది. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్‌, మసాచుసెట్స్‌, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుపానును చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భారీ వృక్షాలు నేలకొరిగాయి. న్యూయార్క్‌లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Tags:    

Similar News