Brazil: బ్రెజిల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

Brazil: భారీ వరదల్లో కొట్టుకుపోయిన కార్లు

Update: 2023-02-20 08:50 GMT

Brazil: బ్రెజిల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

Brazil: భారీ వర్షాలు బ్రెజిల్‌ను వణికిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 36 మంది చనిపోగా అనేక మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సావో సెబాస్టియావో నగరంలో 35 మంది మరణించగా పొరుగున ఉన్న ఉబాతుబాలో 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా సావో సెబాస్టియావో, బెర్టియోగా నగరాల్లో జరగాల్సిన కార్నివాల్ ఉత్సవాలు రద్దు చేశారు. సావో పాలో రాష్ట్రంలో ఒక్కరోజులోనే 600 మిల్లీ మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. బెర్టియోగా ప్రాంతంలో 687 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా స్థానికుల ఇళ్లు మునిగిపోయాయి. అలాగే కొండచరియలు విరిగిపడి 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వరదలకు కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. 

Tags:    

Similar News