Dubai: దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు

Dubai: అబుదాబిలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీరు

Update: 2024-05-02 11:03 GMT

Dubai: దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు

Dubai: దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కుండపోత వానను మరువకముందే.. మరోసారి దుబాయిని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది. దుబాయి నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఇక మే 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయి వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

Tags:    

Similar News