H-1B వీసా $100,000 నియమం పై ఇంకా సందేహాలా? ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన H-1B వీసా పిటిషన్‌పై $100,000 ఫీజు నిర్ణయం భారతీయ ప్రొఫెషనల్స్‌లో ఆందోళన, గందరగోళం రేపింది.

Update: 2025-09-22 08:29 GMT

H-1B వీసా $100,000 నియమం పై ఇంకా సందేహాలా? ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన H-1B వీసా పిటిషన్‌పై $100,000 ఫీజు నిర్ణయం భారతీయ ప్రొఫెషనల్స్‌లో ఆందోళన, గందరగోళం రేపింది.

గత వారం చివర్లో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆయన ప్రకారం ఇప్పటి వరకు ఉన్న వీసా వ్యవస్థను “దుర్వినియోగం” చేస్తున్నారని, అది “జాతీయ భద్రతకు ముప్పు” అని వ్యాఖ్యానించారు.

ట్రంప్ ఆదేశాల తర్వాత అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వెంటనే అమెరికాకు రప్పించాయి. ఆ ఆదేశం అమలులోకి రాకముందే అమెరికాలో ఉండాలని వారిని సూచించాయి.

ఈ ఫీజు కొత్త H-1B దరఖాస్తుదారులకు సంవత్సర జీతం కంటే ఎక్కువే అవుతుందని, దాని ప్రభావం ఏంటన్నదానిపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ముఖ్య ప్రశ్నలు – సమాధానాలు

అందరూ $100,000 ఫీజు చెల్లించాలా?

లేదు. ఇప్పటికే H-1B వీసా ఉన్నవారికి ఈ ఫీజు వర్తించదు. అమెరికా వెలుపల ఉన్నవారు కూడా రీ-ఎంట్రీకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది వార్షిక ఫీజా?

వైట్ హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్‌ ప్రకారం, ఇది ఒక్కసారిగా పిటిషన్ ఫీజు మాత్రమే. ఇది వార్షికంగా వసూలు చేయబడదు.

వీసా రీన్యువల్స్‌కి వర్తిస్తుందా?

లేదు. ఈ ఫీజు కొత్త వీసాలకే వర్తిస్తుంది. రీన్యువల్స్, ఇప్పటికే ఉన్న వీసాలకు ఇది వర్తించదు.

ఎవరికి వర్తిస్తుంది?

సెప్టెంబర్ 21, 2025 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే H-1B వీసా అప్లికెంట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. రాబోయే లాటరీ రౌండ్‌లో మాత్రమే ఇది అమల్లో ఉంటుంది.

ఈ ఫీజు ఎవరు చెల్లించాలి?

కంపెనీలు తమ ఉద్యోగుల కోసం H-1B వీసా పొందాలనుకుంటే, ఈ $100,000 ఫీజును వాళ్లే చెల్లించాలి.

ఎందుకు కంపెనీలు ఉద్యోగులను అమెరికాకు పిలిచాయి?

ప్రకటన తర్వాత అస్పష్టత నెలకొనడంతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీమోర్గాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులు వెంటనే అమెరికాలో ఉండాలని సూచించాయి.

ఎవరికి మినహాయింపు ఉంది?

ఈ ఆదేశం అమల్లోకి రాకముందే దరఖాస్తు చేసుకున్నవారికి

ఇప్పటికే అప్రూవ్ అయిన పిటిషన్లకు

ప్రస్తుతం వాలిడ్ H-1B వీసా కలిగినవారికి

అదనంగా, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని వ్యక్తులు, కంపెనీలు లేదా పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వొచ్చు.

Tags:    

Similar News