America: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురు మృతి
America: వర్జీనియా కామన్వెల్త్ వర్సిటీ సమీపంలో కాల్పులు
America: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురు మృతి
America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక వెలుపల జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని మన్రో పార్క్‌లో ఉన్న ఆల్ట్రియా థియేటర్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో విద్యార్థులు పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు.