America: టేనెస్సీలోని ఓ పాఠశాలలో కాల్పులు జరిపిన యువతి

America: నిందితురాలిని కాల్చి చంపిన పోలీసులు

Update: 2023-03-28 03:18 GMT

America: టేనెస్సీలోని ఓ పాఠశాలలో కాల్పులు జరిపిన యువతి

America: అమెరికాలో మళ్లీ కాల్పలు కలకలం సృష్టించాయి. ఓ యువతి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో.. ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మరణించారు. అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేలో 6వ తరగతి వరకు పిల్లలకు బోధించే ఓ క్రిస్టియన్ పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో పాఠశాలలో 200 మంది పిల్లలు ఉన్నారు. 28 ఏళ్ల యువతి కాల్పులు జరిపినట్లు గుర్తించారు.

కాల్పులు జరుపుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువతి మరణించింది. అయితే ఆ యువతి ఎవరనేది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. కాల్పుల ఘటన అనంతరం తీవ్రంగా గాయపడ్డ చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను స్థానిక వాండర్ బిల్డ్ మన్రో కారెల్ జూనియర్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఘటన తర్వాత పాఠశాలలో ఉన్న ఇతర విద్యార్థులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం 6వ తరగతి దిగువ క్లాస్ విద్యార్థులే కావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. భారీగా పోలీసు బలగాలు మోహరించి పిల్లలందరిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన అగంతుకురాలు ఎవరు? ఈ స్కూల్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? ఏ లక్ష్యంగా ఈ కాల్పులు జరిపింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Tags:    

Similar News