Germany Hamburg Airport: హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పులు.. నిలిచిపోయిన పలు విమానాలు
Germany Hamburg Airport: ఏయిర్ పోర్టు ప్రధాన గేటును వాహనంతో పగలగొట్టి.. కాంప్లెక్స్ లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు
Germany Hamburg Airport: హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పులు.. నిలిచిపోయిన పలు విమానాలు
Germany Hamburg Airport: హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ ల విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు. దీంతో విమానాలన్నీ నిలిచిపోయాయి. ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును వాహనంతో పగలగొట్టి కాంప్లెక్స్ లో విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు.
విమానాశ్రయ భద్రతా అడ్డంకులను బద్దలు కొట్టుకుని విమానం ఎక్కే ప్రాంతంలోకి సదరు వ్యక్తి వెళ్లాడు. దీంతో అతనినిఅడ్డుకునేందుకు కొందరు పోలీసు అధికారులు అతనిని వెంబడిస్తూ ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో దుండగుడితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దుండగుడు చేసిన కాల్పులతో విమానాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని వల్ల సుమారు 27 విమాన సర్వీసులను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి రెండు గాజు సీసాలకు నిప్పు పెట్టి విమానాశ్రయంలోనికి విసిరినట్లు పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.