మాస్క్ అతిగా వాడితే ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా?

Face masks : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడి చనిపోగా మరికొందరు కోలుకున్నారు.

Update: 2020-10-03 07:19 GMT

Face mask

Face masks : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడి చనిపోగా మరికొందరు కోలుకున్నారు. ప్రస్తుతం దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా ఉండవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎప్పటికి శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం లాంటివి కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అటు మాస్క్ లు ధరించని వారిపైన ప్రభుత్వాలు కూడా భారీ జరిమానాలను విధిస్తున్నాయి.

అయితే అతిగా మాస్క్ ధరిస్తే మాత్రం భవిష్యత్తులో ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అయితే ఈ వార్తలను అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం తోసిపుచ్చింది. మాస్క్‌ లు వాడడం వలన ఎలాంటి ప్రమాదం లేదని తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్‌తో బాధపడే కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చని వెల్లడించింది. సహజంగా సీఓపీడీతో భాదపడుతున్న వాళ్లు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి "మాస్క్‌ ధరించడం వల్ల అతి తక్కువ మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదీ కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు" నని వారు పేర్కొన్నారు. ఇక ఈ సమస్య లేని మిగతా వారు మాస్క్ వాడినా ఏ ఇబ్బంది ఉండదని పేర్కొంది.

ఇక మాస్క్‌లను బిగుతుగా ధరించడం, వేగంగా నడవడం వలన శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇతరులకి దూరంగా ఉన్న సమయంలో మాత్రం మాస్క్ తీసిన ప్రమాదం ఏమీ లేదని అన్నారు. 

Tags:    

Similar News