France: మాస్క్‌ ఫ్రీ కంట్రీగా ఫ్రాన్స్‌

France: కరోనా తీవ్రత తీవ్రంగా పడిన యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి.

Update: 2021-06-18 04:56 GMT

France: మాస్క్‌ ఫ్రీ కంట్రీగా ఫ్రాన్స్‌

France: కరోనా తీవ్రత తీవ్రంగా పడిన యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కరోనా కేసులు, మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని ఫ్రాన్స్‌ నిర్ణయించుకుంది. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో ఇకపై మాస్కు ధరించడం కూడా తప్పనిసరి కాదని ప్రకటించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌, మార్కెట్లు, స్టేడియాలు, ప్రజలు గుంపుగూడే ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకుంటే చాలని తెలిపింది.

ఫ్రాన్స్‌లో గత ఏడాది నుంచి రాత్రి కర్ఫ్యూతోపాటు బయటికొస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన అమలులో ఉంది. మొదట్లో సాయంత్రం 6 గంటల నుంచే కర్ఫ్యూ మొదలయ్యేది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి మొదలవుతున్నది. అయితే కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో అనుకున్న దానికంటే పది రోజులు ముందుగానే కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News