Sushila Karki: నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ

Sushila Karki: అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ, సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Update: 2025-09-11 05:43 GMT

Sushila Karki: నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ

Sushila Karki: అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ, సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జన్-జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేశారు. దాదాపు 5వేల మందితో సమావేశమై మంతనాలు జరిపారు.

ఖాట్మాండ్ మేయర్ బాలెన్ షాను తొలుత పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదన్నారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీతో జెన్-జెడ్ ఉద్యమకారులు చర్చలు జరిపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేపాల్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా పనిచేస్తానని మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ తెలిపారు.  

Full View


Tags:    

Similar News