అమెరికాలోని కెంటకీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
* పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి
అమెరికాలోని కెంటకీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
America: అమెరికాలో గన్ కల్చర్ ర రోజు రోజుకూ పెరుగుతోంది. అలవాట్లు, ఒత్తిడి కారణంగా విచ్చల విడిగా కాల్పులకు తెలబడుతున్నారు. ఈ కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. తాజాగా యూఎస్‌లోని కెంటకీ డౌన్‌టౌన్ లూయిస్ విల్లేలో విషాదం నెలకొంది. ఓ దుండగుడు తుపాకీ తో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని అనుమానిత దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటన కెంటకీ లూయిస్ విల్లే లూయిస్‌విల్లే ప్రాంతంలోని ఓల్డ్ నేషనల్ బ్యాంక్ బిల్డింగ్‌లో జరిగింది. అనుమానితుడిని కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు.. అనంతరం, కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
అమెరికాలో గన్ కల్చర్ వీలైనంత వరకూ తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా దేశంలో ఎక్కడో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. కాల్పులకు అమాయక ప్రజలు బలవుతున్నారు. రెండు రోజుల క్రితం రోజు ఫ్లోరిడాలోనూ ఇదేవిధమైన ఘటన జరిగింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరంలో ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకోగా లోపలి నుంచి కాల్పుల శబ్ధం వినిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానితుడు బయటకు వచ్చి పోలీసులపై కూడా కాల్పులకు పాల్పడగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు మరణించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కాల్పులకు ముగ్గురు బలైనట్లు తెలిపారు.