America: అమెరికా ఒహాయోలో భారీ పేలుడు
America: మెటల్ ప్లాంట్‌లో పేలుడు ధాటికి ఒకరు మృతి
America: అమెరికా ఒహాయోలో భారీ పేలుడు
America: అమెరికా ఒహాయోలోని ఒక మెటల్ ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడులో ఒకరు చనిపోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఓక్‌వుడ్ విలేజ్‌లోని కాపర్ అల్లాయ్ కంపెనీలో సంభవించిన భారీ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. కంపెనీ భవనానికి చెందిన శిథిలాలు కొన్ని వందల గజాల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. పేలుడు తర్వాత చెలరేగిన మంటలు, దట్టమైన పొగలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.