"రోడబుల్‌ ఎయిర్‌క్రాప్ట్‌"కు ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ అనుమతులు

* తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికారిక క్లియరెన్స్‌ * ఎగిరేకార్లతో రద్దీగా మారనున్న ఆకాశం

Update: 2021-02-17 06:32 GMT

Representational Image

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు అనుమతులు వచ్చేశాయి. దీంతో ఆకాశం ఎగిరేకార్లతో రద్దీగా మారిపోనుంది. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణించే తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికారిక క్లియరెన్స్‌ లభించింది. ఈ మేరకు అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ అనుమతులు మంజూరు చేసింది. విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ"రోడబుల్‌ ఎయిర్‌క్రాప్ట్‌" లో ఉండడంతో సర్టిఫికెట్‌ జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ఎగిరే కారుకు రహదారి అనుమతులు రానప్పటికీ త్వరలోనే అవి కూడా వస్తాయని చెబుతున్నారు.

రోడబుల్‌ ఎయిర్‌క్రాప్ట్‌ కారు రెక్కల పొడువు 27 అడుగులు. ముడుచుకుంటే చిన్నపాటి కారుషెడ్డులో కూడా ఇది ఇట్టే అమరిపోతుంది. రెండు సీట్ల సామర్థ్యం కలిగిన పూర్తిస్థాయి ఎయిర్‌, రోడ్డు మోడల్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అయితే.. పైలట్లు, ఫ్లైట్‌ స్కూళ్ల కోసం ప్రస్తుతం ఇందులో ప్లైట్‌ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ తీసుకోవాలనుకునే వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు పైలట్‌ సర్టిఫికెట్‌ కూడా ఉండాలని చైనీస్‌ కంపెనీ టెర్రాఫుజియా స్పష్టం చేసింది.

ప్లయింగ్‌ కారు ప్రీమియం గ్యాసోలిన్‌తో కానీ.. 100 ఎల్ఎల్‌ విమాన ఇంధనంతో కానీ పనిచేస్తుంది. కారు హైడ్రాలిక్‌ మోటార్‌పై పనిచేస్తుంది. నాలుగు చక్రాల హైడ్రాలిక్‌ డిస్క్‌ బ్రేకులు, దృడమైన కార్బన్‌ ఫైబర్‌ సేప్టీ కేజ్‌, ఎయిర్‌ఫ్రేమ్‌ పారాచూట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 590 కేజీలు. ఇందులో ల్యాండింగ్‌ గేర్‌, 27 అడుగుల పొడువున్న రెక్కలను అమర్చారు. ఇప్పటికే ఈ ఎగిరే కారు 80 రోజుల ఫ్లైట్‌ టెస్టింగ్‌ పూర్తి చేసుకుందని సంస్థ జనరల్‌ మేనేజర్‌ కెవిన్‌ కోల్‌బర్న్‌ తెలిపారు.

Tags:    

Similar News