Miss Universe 2025: ఫాతిమా బాష్ విజేతగా కిరీటం దక్కించుకున్న మెక్సికో సుందరి
ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ తలపట్టింది. థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది.
Miss Universe 2025: ఫాతిమా బాష్ విజేతగా కిరీటం దక్కించుకున్న మెక్సికో సుందరి
ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ తలపట్టింది. థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. గత ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న డెన్మార్క్ అందాల రాశి విక్టోరియా కెజార్ హెల్విగ్, ఈసారి ఫాతిమాకు కిరీటం అర్పించారు.
ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్ తొలి రన్నరప్‌గా, వెనెజువెలా నుంచి స్టిఫానీ అబాసలీ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్‌ను ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ స్విమ్‌సూట్ రౌండ్ వరకు మెప్పించి టాప్ 30లో చోటు దక్కించుకున్నప్పటికీ, టాప్ 12లోకి చేరలేకపోయింది. దీంతో ఈ ఏడాది భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది.