Electric Air Taxi in Dubai: దుబాయ్‌లో తొలి ప్రయోగం విజయవంతం… కమర్షియల్ సేవలకు రూట్ క్లియర్!

దుబాయ్ నగర రవాణాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ఘట్టంగా, జోబీ ఏవియేషన్ విజయవంతంగా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ప్రయోగించింది.

Update: 2025-07-02 15:46 GMT

Electric Air Taxi in Dubai: దుబాయ్‌లో తొలి ప్రయోగం విజయవంతం… కమర్షియల్ సేవలకు రూట్ క్లియర్!

Electric Air Taxi in Dubai: దుబాయ్ నగర రవాణాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ఘట్టంగా, జోబీ ఏవియేషన్ విజయవంతంగా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ప్రయోగించింది. అమెరికా, కాలిఫోర్నియాలో ఆధారం కలిగిన ఈ సంస్థ, ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ వేగవంతమైన ప్రయాణానికి మార్గం చూపించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

ఈ ఎయిర్ టాక్సీ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి పామ్ జుమైరా వరకు కేవలం 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. అదే మార్గం జమీన్ మీద కారు ద్వారా అయితే దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచే ఈ విమానం పర్యావరణానికి హానికరం కాకుండా, శబ్దం లేని విధంగా రూపొందించబడింది.

ఈ ప్రయోగం సమయంలో, eVTOL వాహనం (Electric Vertical Take-Off and Landing) నేరుగా టేకాఫ్ తీసుకుని, కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ వాహనం గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో, 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 2026 నాటికి దుబాయ్‌లో కమర్షియల్ సర్వీసులు ప్రారంభించేందుకు జోబీ ఇప్పటికే రోడ్లు, రవాణా సంస్థ (RTA)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ప్రారంభ దశలో డిఎక్స్బీ విమానాశ్రయం, పామ్ జుమైరా, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మరీనా ప్రాంతాల్లో నాలుగు వర్టీపోర్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, రెగ్యులేటరీ అనుమతులు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి సవాళ్లు ఇంకా ఉన్నా… ఈ కొత్త సాంకేతికత భవిష్యత్‌ నగర రవాణాలో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Tags:    

Similar News