ఇరాన్‌లో భూకంపం..

ఉత్తర ఇరాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Update: 2020-05-08 03:41 GMT

ఉత్తర ఇరాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో టెహ్రాన్ తూర్పు భాగంలో ఒకరు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానుష్ జహన్‌పూర్ శుక్రవారం తెల్లవారుజామున సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇరాన్ రాజధానిలోని ఒక నివాసి ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. భూమి వణుకు "చాలా బలంగా" అనిపించింది అని అన్నారు. ఆ సమయంలో వస్తువులు ఒక్కసారిగా కిందకి దొర్లాయని చెప్పారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు అర్ధరాత్రి టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భూకంపం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS) ప్రకారం, భూకంపం యొక్క కేంద్రాన్ని దమావండ్ వద్ద, 10km లోతు (6.2 మైళ్లు)లో గుర్తించారు.


Tags:    

Similar News