Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‎లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం

Afghanistan: 260 మంది మృతి.. శిథిలాల కింద వందలాది మంది

Update: 2022-06-22 10:01 GMT

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‎లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం

Afghanistan: ఆ‌ఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై దాని తీవ్రత 6.1గా నమోదైంది. తూర్పు ఆ‌ఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రానికి సమీపంలో భూకంపం సంభవించిందని సిస్మాలజిస్టులు చెబుతున్నారు. ఈ ఘటనలో 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా సంస్థ బఖ్తర్​ వెల్లడించింది. సుమారు వంద ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి సంఖ్య ఎన్ని వందలు ఉంటుందోనన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి.

ఘటనాస్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. ఆ‌ఫ్ఘన్లోని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల ప్రకంపనలు కనిపించాయి. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పాక్‌ అధికారులు చెప్పారు. 

Full View


Tags:    

Similar News