Turkey: తాజాగా 6.4 తీవ్రతతో తుర్కియేలో భూకంపం

Turkey: కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయిన భూకంపం దృశ్యాలు

Update: 2023-02-22 05:10 GMT

Turkey: తాజాగా 6.4 తీవ్రతతో తుర్కియేలో భూకంపం

Turkey: భూకంపం వస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? కళ్లారా చూస్తే తప్ప భూప్రకోపం ఎలా ఉంటుందనేది తెలీదు అయితే, సీసీ కెమెరాల పుణ్యమా అని తుర్కియేలో తాజాగా సంభవించిన భూకంపం మిగతా జనం కూడా చూడగలుగుతున్నారు. తుర్కియేలో సోమవారం రాత్రి 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 294 మంది గాయపడ్డారు. కాగా ఈ భూకంపం దృశ్యాలు ఓ కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో వైరల్ అవుతోంది. భూమిని ఎవరో చేత్తో పట్టుకుని ఊపినట్టుగా ఒక్కసారిగా ఊగిపోయింది. కొన్ని క్షణాల పాటు భూమి అలా కంపించింది. 

Tags:    

Similar News