Donald Trump: పాకిస్తాన్‌లో పర్యటించనున్న డోనాల్డ్ ట్రంప్

Donald Trump to visit Pakistan: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌లో పర్యటించనున్నట్లు ఇస్లామాబాద్ మీడియా వెల్లడించింది.

Update: 2025-07-17 12:05 GMT

Donald Trump: పాకిస్తాన్‌లో పర్యటించనున్న డోనాల్డ్ ట్రంప్

Donald Trump to visit Pakistan: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలో పాకిస్తాన్‌లో విజిట్ చేయనున్నారు. సెప్టెంబర్ నెలలు పాక్‌లో పర్యటించనున్నట్లు ఇస్లామాబాద్ టీవీ ఛానళ్లు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌లో పర్యటించనున్నట్లు ఇస్లామాబాద్ మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో పాక్‌లో పర్యటించి ఆ తర్వాత ఇక్కడ నుంచి భారత్‌కు వెళతారని మీడియా చెప్పుకొచ్చింది. అయితే దీనిపై భారత్‌కు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇటీవల పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్, ఇండియాకి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నేనే సెటెల్ చేసానని ట్రంప్ చెప్పడంతో ఆ కోణంలో ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు.

పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై దాడులతో విరుచుకుపడింది. అయితే ఆ సమయంలో తాను ఎంతో నేర్పుగా పాక్, భారత్ మధ్య సంధి కుదుర్చానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, దీన్ని భారత్ ఖండించింది. ఆ తర్వాత మళ్లీ ట్రంప్ తాను పాక్, భారత్ మధ్య ఎటువంటి సంధి కుదర్చలేదని అన్నారు.

ఇదిలాఉంటే మరోవైపు పాకిస్తాన్ ఇటీవల ట్రంప్‌పై తెగ ప్రశంసల వర్షం కురిపించేస్తుంది. ఇటీవల ట్రంప్‌కు ఆ దేశ శాంతి బహుమతిని కూడా ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ తమ దేశం వస్తున్నట్టు పాక్ మీడియాలు చెప్పుకొస్తున్నాయి. అంతేకాదు, ట్రంప్ కూడా ఈ మధ్య పాక్‌తో సన్నిహితంగా ఉండడం గమనించవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌‌కు వైట్ హౌజ్‌లో అసాధారణ రీతిలో ట్రంప్ ఆతిధ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News