మిమ్మల్ని భూమి మీదకు తీసుకువస్తాం: సునీతా విలియమ్స్ కు ట్రంప్ సందేశం

Donald Trump: సునీతా విలియమ్స్, విల్ మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. మిమ్మల్ని తీసుకురావడానికి వస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

Update: 2025-03-07 06:30 GMT

మిమ్మల్ని భూమి మీదకు తీసుకువస్తాం: సునీతా విలియమ్స్ కు ట్రంప్ సందేశం

Donald Trump: సునీతా విలియమ్స్, విల్ మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. మిమ్మల్ని తీసుకురావడానికి వస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. సునీతా విలియమ్స్, విల్‌మోర్ ను భూమి మీదకు తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించినట్టు ఆయన తెలిపారు.త్వరలోనే భూమి మీదకు వస్తానని సునీతా విలియమ్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

2024 జూన్ 6న సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మానవ సహిత అంతరిక్షయాత్ర ప్రయోగంలో భాగంగా వీరిద్దరూ స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వీరిద్దరూ భూమి మీదకు రావాలి. కానీ, వీరు వెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ అంతరిక్షంలో చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్ , విల్ మోర్ ను తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక 2024 సెప్టెంబర్ లో భూమి మీదకు వచ్చింది.

2024 సెప్టెంబర్ 29న స్పేస్ ఎక్స్ క్రూ ప్రయోగించారు. ఇందులో హాక్, గోర్బునోవ్ అనే ఇద్దరు వ్యోమగాములను నాసా పంపింది. 2025 ఫిబ్రవరిలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్ తో కలిసి ఈ ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రావాలి. కానీ, టెక్నికల్ సమస్యలతో ఇది వాయిదాపడింది.

సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్ లను తీసుకు వచ్చేందుకు అవసరమైన క్రూ 10 ను ప్రారంభించారు. 2025 మార్చి 12 నాటికి దీన్ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు నాసా ప్రకటించింది. నాసా ప్రోటోకాల్ ప్రకారం క్రూ 10 వచ్చే వరకు క్రూ 9 అంతరిక్ష కేంద్రంలోనే ఉండాలి. క్రూ 10కి తొలుత కేటాయించిన డ్రాగన్ క్యాప్సూల్ ను మార్చుకోవడం ద్వారా క్రూ 10 ను నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే భూమి మీదకు తీసుకురావాలనేది ప్లాన్.

Tags:    

Similar News