Donald Trump: భారత్‌పై 25% సుంకాలు విధింపు... ఆగస్టు 1 నుంచి అమలులోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఆర్థిక ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టారు. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ట్రంప్ ప్రకటన ప్రకారం
"భారత్ మిత్రదేశమే అయినా, అక్కడి అధిక సుంకాల కారణంగా వాణిజ్యం పరిమితమవుతోంది. ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఈ తరహా వాణిజ్య అడ్డంకులు ఎక్కడా లేవు."
అంతేకాక, భారత్ రష్యా నుంచి భారీగా రక్షణ ఉత్పత్తులు, అలాగే చమురు దిగుమతులు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచం ఖండిస్తుంటే, భారత్, చైనాలు మాత్రం ఇంకా చమురు దిగుమతులు కొనసాగిస్తుండటం సమంజసం కాదు. అందుకే భారత్‌పై అదనపు పెనాల్టీ టారిఫ్‌గా 25% సుంకాలు విధిస్తున్నాం," అని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ప్రకటించారు.
ఇప్పటికే పలు దేశాలపై ఈ విధమైన ప్రతీకార సుంకాలను ప్రకటించిన ట్రంప్, ఆగస్టు 1ను తుది గడువుగా ప్రకటించగా, భారత్‌పై తాజా నిర్ణయం కూడా ఆ క్రమంలో భాగంగా తీసుకున్నదే. ఈ అంశంపై ట్రంప్ ఇటీవల స్కాట్లాండ్ పర్యటనలో మాట్లాడుతూ ...
"భారత్ విధిస్తున్న సుంకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇది వ్యాపారానికి విఘాతం కలిగించే అంశం," అని వ్యాఖ్యానించారు.