Donald Trump fires on China: చైనాపై మరోసారి ట్రంప్‌ తీవ్ర విమర్శలు

Donald Trump fires on China: చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. కోటి మందికి పైగా ప్రజలు వైరస్ భారిన పడ్డారు. అమెరికా, బ్రెజిల్ దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి.

Update: 2020-07-07 01:23 GMT
Donald Trump Fires on China

Donald Trump fires on China: చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. కోటి మందికి పైగా ప్రజలు వైరస్ భారిన పడ్డారు. అమెరికా, బ్రెజిల్ దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన ఆవేదనను వెళ్లగక్కారు. చైనాపై మరోసారి డోనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసిందని విమర్శించారు. కరోనా వ్యాప్తి విషయంలో చైనా గోప్యత పాటించిందని.. అందువల్లే ఇప్పుడు ప్రపంచం మొత్తం మహమ్మారితో పోరాటం చేస్తుందని.. చైనా వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు. కరోనా విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు చైనానే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గతంలో కూడా కరోనా విషయంలో చైనా అనుసరించిన వైఖరిపై ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే గత కొద్దిరోజులుగా చైనా వ్యవహారశైలి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత్- చైనా సరిహద్దులో అనవసరంగా భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అటు హాంకాంగ్‌ విషయంలో కూడా చైనా తీరుని అమెరికాతోపాటు యూకే, కెనడా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా దేశాలు తీవ్రంగా ఎండగట్టాయి. అయినా కూడా చైనా మాత్రం ఇవేవి తనకు పట్టవన్నట్టు వ్యవహరించడం ప్రపంచ దేశాలకు మంటపుట్టిస్తోంది.  

Tags:    

Similar News