Donald Trump: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

Update: 2020-04-22 03:39 GMT
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన అమెరికాలో నివసించడానికి , పనిచేయాలనుకునే చాలా మంది వలసదారులకు గ్రీన్ కార్డులు జారీ చేస్తారు.. అయితే ఈ కార్డులను 60 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ సస్పెన్షన్ "నిరుద్యోగ అమెరికన్లను ఉద్యోగాల కోసం మొదటి స్థానంలో ఉంచుతుంది" అని ఆయన తన రోజువారీ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ విలేకరుల సమావేశంలో అన్నారు.

వాస్తవానికి ట్రంప్ దీనిపై తన ప్రణాళికను సోమవారం రాత్రి 10 గంటలకు ట్వీట్ చేశారు.. అందులో తాను అమెరికాలోకి "తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేస్తాను" అని పేర్కొన్నారు. వాస్తవానికి ఇమ్మిగ్రేషన్‌ను పరిమితం చేయడానికి అమెరికా అధ్యక్షుడికి విస్తృతమైన అధికారం ఉంది, ముఖ్యంగా ప్రజల భద్రత మరియు జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడే విషయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చని అమెరికా చెబుతోంది.


Tags:    

Similar News