సంచలన తీర్పు: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

Update: 2019-12-17 07:30 GMT
పర్వేజ్‌ ముషారఫ్‌

పాకిస్థాన్‌లో పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. పర్వేజ్‌ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేంగా 2007నవంబర్‌3న దేశంలో ఎమర్జెనీ విధించినందుకు ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది.

దేశ ద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ముషారఫ్‌ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్ ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్ సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.

Tags:    

Similar News