New Jersey: న్యూజెర్సీలో దసరా ఉత్సవాలు

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Update: 2025-10-07 11:48 GMT

New Jersey: న్యూజెర్సీలో దసరా ఉత్సవాలు

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1200 మందికి పైగా ప్రవాసాంధ్రులు వేడుకల్లో పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా ఎలెక్ట్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి దసరా ఉత్సవం ప్రాముఖ్యతను తెలిపారు. వచ్చే ఏడాది ఆటా చేపట్టబోయే మెగా కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారికి అభినందనలు తెలిపారు.

వచ్చే ఏడాది జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో ఆట ఆధ్వర్యంలో జాతీయస్థాయి సదస్సు, 19వ యువజన సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దసరా ఉత్సవాల్లో లిరిస్ట్ కాసర్ల శ్యామ్, ఫోక్ సింగర్స్ రేలారే గంగా, దండేపల్లి శ్రీను, వ్యాఖ్యాత ఝాన్సీ రెడ్డి పాల్గొనడం ద్వారా కార్యక్రమానికి కొత్త ఊపు వచ్చిందన్నారు నిర్వాహకులు. రామలీల ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు, పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

Tags:    

Similar News