గతంతో పోల్చుకుంటే యుఎస్‌లో తగ్గిన కరోనా మరణాలు..

యుఎస్‌లో కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 638 మంది మరణించారు.

Update: 2020-05-25 06:43 GMT
Representational Image

యుఎస్‌లో కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 638 మంది మరణించారు. గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కొంత తగ్గిందనే చెప్పాలి. తాజాగా మరణాలతో దేశంలో మరణించిన వారి సంఖ్య 99 వేల 300 కు పెరిగింది. అలాగే కరోనా సోకిన వారి సంఖ్య 16 లక్షల 86 వేల 436 గా ఉంది. అదే సమయంలో, న్యూయార్క్‌లో 3 లక్ష 71 వేల 193 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం 1000 వెంటిలేటర్లను బ్రెజిల్‌కు విరాళంగా ఇస్తోంది. ఇవి కరోనా పేషంట్లకు వినియోగించాలని సూచించింది.

రక్షణ, వాణిజ్యంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం త్వరలో బలపడుతుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఇదిలావుంటే అమెరికా ద్వారానే కరోనాకు మొదటిగా వ్యాక్సిన్ వస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ'బ్రియన్ పేర్కొన్నారు. చికిత్స కోసం టీకాలను తయారుచేయడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ రెడీ అయిన తరువాత, ఇది అమెరికాతోనే కాకుండా మొత్తం ప్రపంచంతో పంచుకోబడుతుందని అన్నారు.


Tags:    

Similar News