బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 15 వేలు..

ప్రపంచంలో ఇప్పటివరకు 54 లక్షల 97 వేల 443 మందికి వ్యాధి సోకింది.

Update: 2020-05-25 06:01 GMT
Representational Image

ప్రపంచంలో ఇప్పటివరకు 54 లక్షల 97 వేల 443 మందికి వ్యాధి సోకింది. 23 లక్షల 1 వేల 957 మంది నయమయ్యారు. మృతుల సంఖ్య 3 లక్షల 46 వేల 669 కు పెరిగింది. అమెరికా తరువాత, 24 గంటల్లో 15 వేల 813 కొత్త కేసులు బ్రెజిల్‌లో కనుగొనబడ్డాయి. అదే సమయంలో 653 మంది మరణించారు. బ్రెజిల్ లో ఇప్పటివరకు 22 వేల 746 మంది మరణించరు. కరోనా నేపథ్యంలో గత 14 రోజుల్లో బ్రెజిల్‌ను సందర్శించిన విదేశీ పౌరులపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది.

కాగా శుక్రవారం ప్రపంచంలో అత్యధికంగా రెండవ కరోనావైరస్ కేసులు నమోదైన దేశంగా బ్రెజిల్ రష్యాను అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కించింది. శనివారం నాటికి, లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో 347,398 వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 3.65 లక్షలకు పైగా వ్యాధి బారిన పడ్డారు. కాగా దక్షిణ అమెరికా దేశం ఇటీవల కరోనావైరస్‌తో ప్రపంచంలో రెండవ హాట్‌స్పాట్‌గా మారింది.

Tags:    

Similar News