Coronavirus: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్!

ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్ -19) అగ్రరాజ్యం అమెరికాను కూడా గజగజ వణికిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారినపబడి అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది.

Update: 2020-03-05 08:14 GMT
Obama file photo

ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్ -19) అగ్రరాజ్యం అమెరికాను కూడా గజగజ వణికిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారినపబడి అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 130 కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. డజనుకు పైగా రాష్ట్రాలకు ఈ వ్యాధి సోకినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.

కరోనా వైరస్ మహమ్మారి బారిపడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3000 మందికి పైగా మృతి చెందారు. చైనాలో కరోనా వైరస్ నిర్ధారణ అయిన రోగుల సంఖ్య 80,409కి చేరింది. మొత్తం 76 దేశాలకు ఈ వైరస్ వ్యాపించగా..చైనాకు బయట కొత్తగా నమోదైన 2,103 కేసులను కలుపుకుని మొత్తం 12,668 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థారణ అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. చైనాకు బయట కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 48 నుంచి 214కు పెరిగింది. స్పెయిన్, చిలీ, పోలాండ్, హంగేరీ తదితర దేశాల్లో తొలి కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు 8 బిల్లియన్ డాలర్లను కేటాయించింది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ ట్వీట్ చేశారు. ప్రజలంతా ముందు జాగ్రత్త చర్యగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనారోగ్యంగా ఉంటే ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కుల కొరత కారణంగా వాటిని వైద్య సిబ్బంది కోసం ఆదా చేయాలని సూచించారు. ప్రశాంతంగా ఉండి, స్థానిక వైద్య నిపుణుల సలహాలు పాటించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.



Tags:    

Similar News