Coronavirus vaccine: కరోనా వ్యాక్సిన్ పై శుభవార్త అందించనున్న ఆక్స్‌ఫర్డ్

Update: 2020-07-16 07:20 GMT

కరోనా నివారించేందుకు వ్యాక్సిన్ ను కనిపెట్టిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వాక్సిన్‌ ట్రైల్స్‌కు సంబంధించి శుభవార్తనందించనుంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్‌-3 హ్యూమన్‌ ట్రైల్స్‌ పూర్తి చేసామని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌ ట్రైల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి గురువారం తెలిపే అవకాశాల ఉన్నాయి.

వివిధ దేశాలలో వందల మంది కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నా, వాటిలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శటీ లైసెన్స్‌ పొందించిన ప్రముఖ ఇండియన్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త వెల్లడి చేసారు. ఈ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇది మనుషుల మీద ప్రయోగించినప్పుడు చక్కగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

Tags:    

Similar News