Coronavirus Updates: ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. సోమవారం 71149 కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-21 02:15 GMT
Representational Image

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. సోమవారం 71149 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2477724కి చేరింది. అయితే ఇప్పటి వరకు 645276 మందికి కోలుకున్నారు. ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 16,62213గా ఉంది. 56718 మంది పరిస్దితి చాలా తీవ్రంగా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో 3 శాతం మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మాత్రం నెల రోజులుగా రోజూ 5వేలకు పైనే నమోదవుతోంది. సోమవారం 5193 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 170223కి చేరింది.

అమెరికాలో కరోనా వైరస్ విలయతాడవం చేస్తోంది. ఆ దేశంలో కరోనా ఏమాత్రం కంట్రోల్ కావట్లేదని చెప్పాలి. సోమవారం ఆ దేశంలో కరోనా బారిన పడి 1883 మంది మరణించారు. ఇక పాజిటివ్ కేసులు 26989 నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 791624గా ఉంది. ఇప్పటవరకూ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 42458కి చేరింది.

ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ , టర్కీ, ఇరాన్ దేశాల్లో కరోనా పాటిజివ్ కేసులు రోజూ వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మరికొన్ని దేశాల్లో 5వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. అలాగే మృతుల సంఖ్య తగ్గుతుంది. ఈ దేశాల్లో 600లోపే నమోదవుతోంది.

అయితే రష్యాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 4268 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 47121 అయ్యాయి. అలాగే సోమవారం ఒక్కరోజే 44 మంది చనిపోవడంతో రష్యాలో మొత్తం మృతుల సంఖ్య 405కు చేరింది. రష్యాలో కరోనా వైరస్ ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆమాంతం పెరుగుతున్నాయి.


Tags:    

Similar News