Coronavirus: ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగిస్తూనే ఉంది. అమెరికా, ఐరోపా దేశాలను అల్లాడించిన ఈ మహమ్మారి ప్రస్తుతం బ్రెజిల్‌లో పంజా విసురుతోంది.

Update: 2020-05-09 06:33 GMT
Representational Image

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగిస్తూనే ఉంది. అమెరికా, ఐరోపా దేశాలను అల్లాడించిన ఈ మహమ్మారి ప్రస్తుతం బ్రెజిల్‌లో పంజా విసురుతోంది. గత 24 గంటల్లోనే 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 10,000 దాటాయి. రష్యాలో కొత్తగా 10 వేలకిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 1.46 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ మొత్తం 40 లక్షల మంది వైరస్ బారినపడగా.. 2.76 లక్షల మంది మరణించారు.మరో 14 లక్షల మంది కోలుకోగా.. 23 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, బ్రిటన్‌, రష్యాలల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో మొత్తం 13.21 లక్షల మందికి వైరస్ సోకగా.. వీరిలో 78,615 మంది చనిపోయారు. బ్రిటన్‌లో 31,241 ఈ వైరస్ బారిన పడ్డారు. ఫ్రాన్స్‌లో 26,230 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో 170,588 మంది వైరస్ బారినపడగా.. 7,500 మంది చనిపోయారు. టర్కీలో 135,569 మంది, ఇరాన్‌లో 104,691 మంది, ఫ్రాన్స్‌లో 176,079 మంది, కెనడాలో 66,434 మంది, బెల్జియం 52,011 మంది, నెదర్లాండ్ 42,093 మంది వైరస్ బారినపడ్డారు. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం కొత్తగా 81 మందికి వ్యాధి సోకింది.


Tags:    

Similar News