Coronavirus : మళ్ళీ రెండో స్థానంలోకి రష్యా.. బ్రెజిల్ వెనక్కి..

కరోనా ప్రభావిత దేశాలలో రష్యా రెండవ స్థానంలో ఉంది. రష్యాలో 24 గంటల్లో 8599 కేసులు నమోదయ్యాయి..

Update: 2020-05-24 15:25 GMT

కరోనా ప్రభావిత దేశాలలో రష్యా రెండవ స్థానంలో ఉంది. రష్యాలో 24 గంటల్లో 8599 కేసులు నమోదయ్యాయి.. అలాగే కొత్తగా 150 మంది మరణించారు.. దాంతో మరణాల సంఖ్య 3541 కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ 3.44 లక్షల కేసులు నమోదయ్యాయి, ఒకరోజు ముందు 3,35,882 కేసులతో రష్యాను బ్రెజిల్ అధిగమించింది. నిన్నటివరకు కేసుల పరంగా బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.

అయితే రష్యాలో మరణాల కన్నా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాంతో ఒక్కరోజు వ్యవధిలోనే రష్యా మళ్ళీ రెండో స్థానంలోకి వచ్చింది. రష్యాలో మరణాల రేటు ఇతర దేశాల కంటే తక్కువగా ఉందని.. రష్యా అంటు వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ అలీనా మాలినికోవా అన్నారు.. ఇందుకు కారణం సరైన సమయంలో ఇన్ఫెక్షన్ కనుగొనబడటమే అన్నారు. ఎవరికైనా లక్షణాలు చూపించిన వెంటనే ప్రజలు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.


Tags:    

Similar News