చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

Update: 2020-05-11 07:57 GMT
Representational Image

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ సోమవారం ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు వ్యూహన్ నగరంలో నమోదయ్యాయి. ఇక జిలిన్ ప్రావిన్సులోని షూల‌న్ న‌గరంలో కొత్తగా 11 కేసులు నమోదు అయ్యాయి. దీనితో న‌గ‌రాన్ని లాక్‌డౌన్ చేశారు..

షూల‌న్ న‌గ‌రంలో ఉన్న అన్ని ప‌బ్లిక్ స్థ‌లాల‌ను మూసివేశారు. న‌గ‌ర‌వాసులంద‌ర్నీ ఇండ్ల‌ల్లోనే ఉండాలంటూ ఆదేశించారు. ఇక ప్ర‌జా రవాణా వ్య‌వ‌స్థ‌ను కూడా నిలిపేశారు. ఆ న‌గ‌రాన్ని హైరిస్క్ ప్రాంతంగా ప్ర‌క‌టించారు. ఇక చైనాలో మళ్లీ కేసులు పునరావృతం కావడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకారంగా మారింది. అయితే ఇక్కడ అన్ని కేసులు ఓ 45 ఏళ్ల మహిళ చుట్టూ లింక్ అయినట్టు సమాచారం..

Tags:    

Similar News