Coronavirus: ఆ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా..

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది..

Update: 2020-05-24 07:19 GMT
Representaional Image

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఇక్కడ గత 24 గంటల్లో 1127 మరణాలు సంభవించాయి.. దాంతో అమెరికాలో 98 వేల 683 మరణాలు నమోదయ్యాయి. కరోనావైరస్ పేరుకు చైనాలో ఉద్భవించినప్పటికీ అమెరికాలోనే అత్యధికంగా కేసులు, మరణాలు ఉన్నాయి. అమెరికా దేశంలో ఎక్కువగా ప్రభావితమైన న్యూయార్క్‌లో 24 గంటల్లో 84 మంది మరణించారు. మార్చి తరువాత మొదటిసారిగా, ఒకే రోజులో మరణించిన వారి సంఖ్య 100 కంటే తక్కువగా నమోదైంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా సోకిన వారి సంఖ్య 16 లక్షల 66 వేల 828 కు చేరుకుంది. న్యూయార్క్‌లో ఇప్పుడు ఇన్‌ఫెక్షన్లు, మరణాల సంఖ్య తగ్గుతోంది. ఇక్కడ ఇప్పటివరకు 3 లక్షల 69 వేల 656 మందికి కరోనా వ్యాధి సోకింది, 29 వేల 112 మంది మరణించారు. కాగా శనివారం సాయంత్రం నాటికి, యుఎస్ లో మొత్తం 97,048 మరణాలు , 1.6 మిలియన్ వైరస్ కేసులను నమోదు చేసింది, అతి కొద్ది రోజుల్లోనే అమెరికా 100,000 మరణాలకు చేరుకుంటుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.  


Tags:    

Similar News