Coronavirus: అమెరికాలో తగ్గిన మరణాలు..

ప్రపంచంలో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా 55 వేల 413 మంది మరణించారు.

Update: 2020-04-27 08:46 GMT
Representational Image

ప్రపంచంలో ఇప్పటివరకు 29 లక్షల 94 వేల 731 మంది మహమ్మారి భారిన పడ్డారు, అయితే ఎనిమిది లక్షల 78 వేల 792 మందికి నయమైంది. కరోనా భారిన పడిన దేశాల్లో యుఎస్‌ పరిస్థితి మరీ దారుణం. అక్కడ గత 24 గంటల్లో 1331 మంది మరణించారు. మునుపటి రోజు(ఆదివారం) కంటే  తక్కువ మరణాలు సంభవించాయి. ఒక రోజు క్రితం (శనివారం) 2494 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 55 వేల 413 మంది మరణించగా, తొమ్మిది లక్షల 87 వేల 160 మంది వ్యాధి బారిన పడ్డారు.

మిన్నెసోటా, కొలరాడో, మిసిసిపీ, మోంటానా మరియు టేనస్సీ వంటి అనేక రాష్ట్రాలకు లాక్ డౌన్ సడలింపులు ఉన్నాయి. కరోనా కారణంగా ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు ఆదివారం మరణించారు. ఇప్పటివరకు మొత్తం 37 మంది న్యూయార్క్ పోలీసులు మహమ్మారికి బలయ్యారు. ఏప్రిల్‌లో తొలిసారిగా ఆదివారం న్యూయార్క్‌లో 400 కన్నా తక్కువ మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 22 వేల 275 మంది మరణించగా, రెండు లక్షల 93 వేల 991 మందికి వ్యాధి సోకింది. న్యూయార్క్ నగరం అమెరికాలో వ్యాప్తికి కేంద్రంగా ఉంది. 

Tags:    

Similar News