గాలిలో కొవిడ్‌-19 వైరస్‌ జన్యు అవశేషాలు

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి..

Update: 2020-04-28 08:24 GMT
Representational Image

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. దీనికి వాక్సిన్ ని కనుకునేందుకు శాస్త్రవేత్తలు తమ శక్తీకి మించి ప్రయత్నిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ గురించి చైనాలోని వూహాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు మరో విషయాన్ని గుర్తించారు. కరోనావైరస్ రోగులకి చికిత్సను అందించే ప్రదేశాలలో లేదా వెంటిలేషన్ లేని గదులలో గాలిలో కరోనా జన్యు అవశేషాలు ఉన్నట్లుగా తేల్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వూహాన్‌లో రెండు కరోనా ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో గాలిలో తేలియాడుతున్న వైరస్ యొక్క జన్యు అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించారు. నేచర్ రీసెర్చ్‌ జర్నల్‌లో పరిశోధకులు ఈ విషయాలను తెలిపారు.

తమ అధ్యయనంలో ఆయా ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 రోగులు వాడే శౌచాలయాలకు తగిన వెంటిలేషన్ లేకపోవడంతో అవి వైరస్‌తో కూడిన తుంపరలకు ఆవాసాలుగా మారాయని వూహాన్ పరిశోధకులు తమ అధ్యయన నివేదికలో తెలిపారు. దీంతో అక్కడి నుంచే ఈ తుంపరలను వాహకంగా వాడుకొన్న వైరస్ ఆర్ఎన్ఏ ఆ ఆసుపత్రుల పరిసరాల్లోలోకి ప్రవేశించిందని వెల్లడించారు.

అంతేకాకుండా కరోనా రోగులకు చికిత్స చేసిన తర్వాత ఆరోగ్య సిబ్బంది వైద్య సిబ్బంది పరికరాలు ఉన్న గదులలో ముఖ్యంగా అధిక సాంద్రతలు కనిపించాయి, చేతి గౌన్లు విప్పేసే సమయంలో గాల్లోకి కరోనా వైరస్‌తో కూడిన తుంపరలు బయటకు వచ్చినట్లు తెలిపారు.. శాస్త్రవేత్తలు ఈ కొత్త కరోనావైరస్ గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది గాలిలో కణాల ద్వారా వ్యాపించగలదా అనే ప్రశ్న ఇంకా చర్చనీయాంశమైంది. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల మందికి పైగా సోకిన ఈ వైరస్ 208,131 మందిని బలి తీసుకుంది.

Tags:    

Similar News