Coronavirus : కరోనా కరాళనృత్యం.. రష్యాను నెట్టేసిన బ్రెజిల్..

బ్రెజిల్ లో పక్కనే ఉన్న అమెరికా ప్రభావం బాగా కనిపించినట్టుంది..

Update: 2020-05-23 08:32 GMT
Representational Image

బ్రెజిల్ లో పక్కనే ఉన్న అమెరికా ప్రభావం బాగా కనిపించినట్టుంది.. కరోనావైరస్ కేసులు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 330,000 లను బ్రెజిల్ ధృవీకరించింది, దీంతో రష్యాను అధిగమించి రెండవ అత్యధిక అంటువ్యాధులు కలిగిన దేశంగా నిలిచింది, యునైటెడ్ స్టేట్స్ తరువాత స్థానంలో బ్రెజిల్ నిలిచింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దక్షిణ అమెరికాను ఘోరమైన వైరస్ యొక్క "కొత్త కేంద్రం"గా అభివర్ణించింది, WHO యొక్క అత్యవసర డైరెక్టర్ మైక్ ర్యాన్ బ్రెజిల్ పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, దక్షిణ అమెరికా ఈ వ్యాధికి కొత్త కేంద్రంగా మారింది. అనేక దక్షిణ అమెరికా దేశాలలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయని రియాన్ ఒక వర్చువల్ వార్తా సమావేశంలో అన్నారు. ఇందులో ఎక్కువగా బ్రెజిల్ ప్రభావితమైంది ఆయన చెప్పారు. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ లో 1,001 కరోనావైరస్ మరణాలను నమోదు చేసిందని, మొత్తం 21,048 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


Tags:    

Similar News