ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. లక్ష మంది కంటే తక్కువ చనిపోతే మంచిదే

కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విఫలమైయ్యారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Update: 2020-05-04 06:34 GMT
Donald Trump (File Photo)

కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విఫలమైయ్యారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కరోనా వలన తమదేశంలో లక్ష మంది అమెరికన్లు చనిపోవచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు.

ట్రంప్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చైనాయే ఈ వైరస్‌ని వ్యాపింపజేసిందని విరుచుకుపడ్డారు. అమెరికా ఎకానమీ త్వరగా రికవరీ అవుతుందని అంటూనే.. ఈ వైరస్ వల్ల లక్ష మంది కంటే తక్కువే చనిపోతే మంచిదే అన్నారు. దేశం మొత్తాన్నీ లాక్ డౌన్ లో ఉంచలేమని ఆయన అన్నారు.

అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువవుతోంది. మరణాలు 68 వేలు దాటాయి. రోజూ వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. ట్రంప్ అంచనా ప్రకారమైతే మరో 32 వేల మంది ఈ వైరస్ కారణంగా చనిపోతారు. అమెరికాలో తొలి కరోనా నిరోధక వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికి అందుబాటులోకి వస్తుంది. మరో ఏడు నెలల టైమ్ ఉంది. ఈ లోగా కరోనా ఎంత మందికి సోకుతుందో అంచనాకు అందట్లేదు.


Tags:    

Similar News