అమెరికాలో 90 వేలకు చేరిన కరోనా మరణాలు

అమెరికాలో కరోనావైరస్ కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వ్యాధి భారిన పడి 820 మంది మరణించారు.

Update: 2020-05-18 08:24 GMT

అమెరికాలో కరోనావైరస్ కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వ్యాధి భారిన పడి 820 మంది మరణించారు. దాంతో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 90 వేలకు పైగా చేరుకుంది. ఈ మధ్య ప్రతి రోజు మరణాలు తగ్గుతున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 15 లక్షలకు పైగా 27 వేల మందికి వైరస్ సోకింది. న్యూయార్క్ , న్యూజెర్సీ ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.

న్యూయార్క్‌లో మాత్రమే మూడు లక్షలకు పైగా ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయి. న్యూజెర్సీలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి, 10,000 మంది మరణించారు. ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పదేళ్ల భారతీయ బాలికను సత్కరించారు. కరోనాతో పోరాడుతున్న నర్సులకు ఆ అమ్మాయి కుకీలను విరాళంగా ఇచ్చింది. అలాగే ఆరోగ్య కార్యకర్తలకు గ్రీటింగ్ కార్డులు పంపారు.

Tags:    

Similar News