'యుఎఇ'లో పెరిగిన కరోనా కేసులు.. టర్కీలో తగ్గుముఖం

గడిచిన 24 గంటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో 994 కొత్త కరోనా కేసులతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 27,892 కు పెరిగింది.

Update: 2020-05-23 09:38 GMT
Representational Image

గడిచిన 24 గంటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో 994 కొత్త కరోనా కేసులతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 27,892 కు పెరిగింది. అనేక మంది విదేశీ పౌరులలో కొత్త కేసులు వస్తున్నాయని యుఎఇ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, అందరి పరిస్థితి స్థిరంగా ఉంటుందని.. దేశంలో ఇప్పటివరకు 13,798 మంది కోలుకున్నారని.. అదే సమయంలో, మరణాల సంఖ్య 241 కు పెరిగిందని వెల్లడించింది.

మరోవైపు బ్రిటన్ లో ఇప్పటివరకు 36 వేలకు పైగా ప్రజలు మరణించగా, 2 లక్షలకు పైగా 54 వేల మందికి సోకింది. ఈ నేపథ్యంలో జూన్ 8 నుంచి ఎవరు బ్రిటన్‌కు వచ్చినా 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ అన్నారు. మినహాయింపు పరిధిలోకి వచ్చిన వారిని మాత్రమే దాని నుండి మినహాయించబడతారని ఆయన అన్నారు. అలాగే బ్రిటీష్ ప్రభుత్వం ప్రయాణానికి సంబంధించిన కొత్త నిబంధనలను కూడా జారీ చేసింది.

ఇదిలావుంటే టర్కీలో కరోనా వ్యాధి తీవ్రత తగ్గుతోంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 952 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. మార్చి 25 తర్వాత ఇది అతి స్వల్పమని.. ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోజా ట్వీట్ చేశారు.. దీంతో మొత్తం కరోనా రోగుల సంఖ్య 1,54,500 కు పెరిగిందని.. 27 మంది రోగులు శుక్రవారం మరణించారని.. మృతుల సంఖ్య 4,276 కు పెరిగిందని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News