అమెరికాలో కరోనా విజృంభణ.. నిరుద్యోగ సమస్య తీవ్రం..

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

Update: 2020-05-23 08:54 GMT
Representational Image

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 1260 మంది మరణించగా , 24 వేల 197 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో మరణించిన వారి సంఖ్య 97 వేలు 647 కు చేరుకోగా, 16 లక్షల 45 వేల 94 మందికి వ్యాధి సోకింది. మరోవైపు దక్షిణ అమెరికా అంటువ్యాధికి కొత్త కేంద్రంగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇప్పటివరకు ఇక్కడ 5 లక్షల 80 వేల కేసులు నమోదయ్యాయి, 29 వేల 444 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలావుంటే అమెరికాలో కరోనా మహమ్మారి ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో అనేక సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధించాయి. ఫలితంగా ఇప్పటివరకు 3.9 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తున్నా, నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువవుతోంది. దీనినుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు.


Tags:    

Similar News