Coronavirus: ఈ మూడు దేశాల్లో తగ్గినా మరణాలు..

ప్రపంచంలో కరోనాకు తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో ఇటలీ , స్పెయిన్, ఫ్రాన్స్ ఎక్కువ. ఇక్కడ ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతోంది.

Update: 2020-04-24 09:40 GMT

ప్రపంచంలో కరోనాకు తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో ఇటలీ , స్పెయిన్, ఫ్రాన్స్ ఎక్కువ. ఇక్కడ ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతోంది. ఇటలీలో గత 24 గంటల్లో 433 మంది వైరస్ భారిన పడి మరణించారు. ఇక కేసుల పరంగా చూస్తే ఇక్కడ గత 24 గంటల్లో ఇక్కడ 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.. దాంతో మొత్తం 189,973 ఉన్నాయి. ఇక స్పెయిన్‌లో గురువారం 399 మంది మరణించారు. కాగా, ఇక్కడ మరణించిన వారి సంఖ్య ముందు రోజు 410 గా ఉంది.

ఇక్కడ గురువారం 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దాంతో మొత్తం 213,024 గా ఉన్నాయి. అలాగే గురువారం 395 మరణాలు ఫ్రాన్స్‌లో నమోదయ్యాయి. గత 24 గంటలలో ఇక్కడ దాదాపు 3వేల కేసులు నమోదు అయ్యాయి. దాంతో మొత్తం కేసులు 158,183గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నత ఆరోగ్య అధికారి జెరోమ్ సలోమన్ ప్రకారం, వరుసగా ఐదవ రోజు ఆసుపత్రిలో చేరడం తగ్గింది. అంతేకాదు ఐసియులో చేరిన వారి సంఖ్య కూడా వరుసగా 11 వ రోజు తగ్గింది. కాగా ఐరోపాలో 1.1 మిలియన్ల మంది వ్యాధి బారిన పడ్డారు.


Tags:    

Similar News